పాల్వంచలో గద్దర్ కు నివాళులర్పించిన ఉద్యమకారులు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సయ్యద్ రషీద్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజా కళాకారుడు గద్దర్ వర్ధంతి, ఆచార్య జయశంకర్ జయంతి, మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ వర్ధంతి కార్యక్రమాలను బుధవారం ఘనంగా నిర్వహించారు.
పాల్వంచ బస్టాండ్ సమీపంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఉద్యమకారులు వారికి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో టీయూఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎండి మంజూరు, తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి వేముల కొండలరావు, ఉద్యమకారులు బుడగం నాగేశ్వరరావు, ఎస్‌కే బాషా (జూ.గద్దర్), శ్రీపాద సత్యనారాయణ, ఎస్‌కే నబీ సాబ్, నిమ్మల రాంబాబు, ఉబ్బన శ్రీను, ఐలయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment