న్యాయాధికారికి శుభాకాంక్షలు తెలిపిన వివిధ సంఘాల నాయకులు

న్యాయాధికారికి శుభాకాంక్షలు తెలిపిన వివిధ సంఘాల నాయకులు

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: హైదరాబాద్ (సిటీ సివిల్ కోర్ట్) 7వ ఆదనపు జూనియర్ సివిల్ జడ్జి గా  పాల్వంచకు చెందిన కాటూరి బిందు ఇటివల  నియామకం కావడం పట్ల వివిధ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఇందిరా కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ మైనార్టీ నాయకులు మస్తాన్ ఖురేషి ఆధ్వర్యంలో సందీప్, ఖాజా ఖురేషి తదితరులు కాటూరి బిందును సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

అదేవిధంగా పాల్వంచ మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కటుకూరి శేఖర్ బాబు ఆధ్వర్యంలో బోగిని సందీప్, కిన్నెర శ్రీను, వానపాకుల నాగరాజు, రాయల చంద్రం, దారెల్లి వెంకటేశ్వర్లు, ఇసనపల్లి వంశీ, పిన్నింటి రాజు, జిల్లేపల్లి చిరంజీవి, మేశపోగు జీవన్ కుమార్ తదితరులు కూడా కాటూరి బిందును సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

Blogger ఆధారితం.