ఏసీబీ కి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన కొత్తగూడెం వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: కొత్తగూడెం జిల్లా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నర్సింహారావు ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సోమవారం కొత్తగూడెం...విద్యానగర్‌లోని తన కార్యాలయంలో రూ.25 వేల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
''ఫర్టిలైజర్ షాప్ యజమాని తన దుకాణంలో సరైన ఇన్వాయిస్ లేకుండా యూరియా సంచులను అమ్మినందుకు గానూ దానిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు" అధికారిక సహాయం అందించేందుకు ఫిర్యాదుదారుని నుండి నర్సింహారావు రూ.25,000/ లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ సిబ్బందితో కలిసి నిర్వహించిన దాడిలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Post a Comment