గణేష్, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్
జె.హెచ్.9. మీడియా, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గణేష్ చతుర్థి, దుర్గామాత నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అనుమతి పొందిన మండపాలకు తాత్కాలిక కనెక్షన్లు కేటగిరి-8 కింద ఇవ్వాలని డిస్కంలు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నెల 27 నుంచి వినాయక నవరాత్రులు ప్రారంభమవుతుండగా, సెప్టెంబర్ 6 వరకు 11 రోజులపాటు మండపాల అలంకరణకు విద్యుత్ అందించనున్నారు. అలాగే, దసరా సందర్భంగా ఏర్పాటుచేసే దుర్గామాత మండపాలకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు ఉచిత విద్యుత్ సరఫరా ఉంటుంది.
గత ఏడాది 30 వేలకుపైగా మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తూ, రూ.29 కోట్ల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం భరించింది. ఈసారి కూడా మండప నిర్వాహకుల నుంచి లోడ్ అవసరం, జీపీఎస్ వివరాలు, ఉత్సవ సమితి పేరు, సంప్రదింపు నంబర్ సేకరించి కనెక్షన్లు ఇవ్వనున్నారు.

Post a Comment