న్యాయశాఖ ఉద్యోగుల సంఘ ఆధ్వర్యంలో న్యాయాధికారి వినయ్ కు ఘన సన్మానం
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: కొత్తగూడెం మూడవ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వనం వినయ్‌కుమార్‌ను జిల్లా న్యాయశాఖ ఉద్యోగులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆ సంఘ అధ్యక్షుడు రామిశెట్టి రమేష్ న్యాయాధికారి వినయ్‌కుమార్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ దీకొండ రవికుమార్, ట్రెజరర్ లగడపాటి సురేష్, అసోసియేట్ ప్రెసిడెంట్ నిమ్మల మల్లికార్జున్, ఉపాధ్యక్షులు ఈ. మీనాకుమారి, జి. ప్రమీల, జాయింట్ సెక్రటరీ హెచ్. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Advertising:


Post a Comment