ఖమ్మం, భద్రాద్రి జిల్లాలలో బైక్ చోరీల కలకలం

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలలో బైక్ చోరీల కలకలం

జె.హెచ్.9.మీడియా, వెబ్ డెస్క్ :  ఖమ్మంభద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో జరుగుతున్న ద్విచక్రవాహనాల చోరీలు స్థానికులలో ఆందోళనను పెంచుతున్నాయి. ఇళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రభుత్వ ఆసుపత్రులు, రైతు బజార్లలో నిలిపిన వాహనాలు మాయం అవుతుండడంతో వాహనదారులు పరేషాన్ అవుతున్నారు.

ఇక తాజాగా, కొత్తగూడెం పట్టణానికి చెందిన నలుగురు యువకులు, ఆంధ్రప్రదేశ్ లోని ఎన్‌టీఆర్ జిల్లాకు చెందిన మరో ఇద్దరితో కలిసి ఇబ్రహీంపట్నం లోని ఒక ద్విచక్రవాహనాన్ని చోరీ చేశారు. దానిని ఒరీశా సరిహద్దుకు తరలించి, ఆ బైక్ లో 35 కిలోల గంజాయి తీసుకువచ్చారు. వీరిలో ఒకరు ఇటీవల ఏపీ పోలీసులకు పట్టుబడిన ఘటన వెలుగులోకి వచ్చింది.

వాహనాల చోరీలకు ప్రధాన కారణాలు ఇలా ఉన్నాయి:

  • వాహనాలకు తాళాలు, హ్యాండిల్‌ లాక్, వీల్‌ లాక్ వంటి భద్రతా పరికరాలను ఉపయోగించకపోవడం.
  • నిర్మానుష్య ప్రాంతాల్లో, సీసీటీవీ లేని ప్రదేశాలలో వాహనాలను నిలపడం.
  • వాహనాలకు తాళాలను కాస్త “సాధారణ” గా మాత్రమే వాడడం.
  • జీపీఎస్ ట్రాకర్, అలారం సిస్టమ్ వంటి ఆధునిక భద్రతా పరికరాలను ఉపయోగించకపోవడం.
  • బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో పార్కింగ్ చార్జీలను తప్పించుకోవడానికి వాహనాలను సరైన స్థలంలో ఉంచకపోవడం ఈ చోరీలకు ప్రధాన కారణాలు గా మారాయి.

పోలీసుల సూచనలు:

వాహనదారులు తమ బండ్లను దొంగల నుండి రక్షించుకోవడానికి..వాహనాలను బయట నిలిపి వెళ్ళాల్సి వస్తే, వీల్లాక్, జీపీఎస్ ట్రాకర్ వంటి భద్రతా పరికరాలను ఉపయోగించడం మంచిదని అంటున్నారు. పార్కింగ్ స్థానాలను జాగ్రత్తగా ఎంచుకోవాలని అంటున్నారు. జీపీఎస్ ఉన్న వాహనాలను చోరీకి గురైతే గుర్తించడం సులభమవుతుంది పోలీసులు చెబుతున్నారు.

Blogger ఆధారితం.