అధికారులు సకాలంలో హాజరు కావాలి : కలెక్టర్
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: రేపు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌లో జరగనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు.
ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందజేయాలని సూచించారు. ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి ప్రారంభమవుతుందని కలెక్టర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Post a Comment