ఏసీబీ వలలో డోర్నకల్ సీఐ రాజేష్ నాయక్

ఏసీబీ వలలో డోర్నకల్ సీఐ రాజేష్ నాయక్
జె.హెచ్.9.మీడియా, మహబూబాబాద్: డోర్నకల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) రాజేష్ నాయక్, ఆయన గన్‌మన్ దారావత్ రవి ఏసీబీ వలలో చిక్కారు. శనివారం లంచం స్వీకరిస్తున్న సమయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వారిని రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్టు చేశారు.

ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వివరాల ప్రకారం... ఓ వ్యాపారిపై కేసు నమోదైన నేపథ్యంలో సీఐ రాజేష్ నాయక్, గన్‌మన్ రవి రూ.50 వేల లంచం డిమాండ్ చేశారు. చివరికి రూ.30 వేల రూపాయల వద్ద ఒప్పందం కుదిరింది. లంచం ఇవ్వడం ఇష్టం లేని వ్యాపారి ఏసీబీని ఆశ్రయించగా, ముందస్తు ఏర్పాట్లతో ఏసీబీ అధికారులు సీఐ నివాసంలోనే లంచం స్వీకరిస్తున్న సమయంలో వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

తర్వాత సీఐ ఇంటిలో నిర్వహించిన సోదాలో లెక్కల్లో లేని రూ.1.25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సీఐ రాజేష్ నాయక్, గన్‌మన్ రవిని అదుపులోకి తీసుకుని ఏసీబీ కోర్టుకు హాజరుచేసినట్లు అధికారులు తెలిపారు.

ఏసీబీ డీఎస్పీ సాంబయ్య మాట్లాడుతూ “ఒకవేళ ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినట్లయితే ప్రజలు వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖ వారి టోల్‌ఫ్రీ నంబర్ 1064 కు డయల్ చేయాలి. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఏసీబీని సంప్రదించవచ్చు అని అన్నారు. వాట్సాప్ నంబర్ 9440446106, ఫేస్‌బుక్‌లో Telangana ACB, ఎక్స్‌లో @TelanganaACB, వెబ్‌సైట్ acb.telangana.gov.in ద్వారా కూడా సంప్రదించవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతాం” అని ఆయన తెలిపారు.

Blogger ఆధారితం.