కృష్ణ మహేష్ యువసేన ఆధ్వర్యంలో మహేష్ బాబు జన్మదిన వేడుకలు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: కృష్ణ మహేష్ యువసేన ఆధ్వర్యంలో శనివారం ప్రముఖ సినీ హీరో, సూపర్ స్టార్ మహేష్ బాబు 50వ జన్మదిన వేడుకలను పాల్వంచ బస్టాండ్‌లో ప్రయాణికుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమాన సంఘ నాయకులు మాట్లాడుతూ మహేష్ బాబు కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సామాజిక సేవలో కూడా అగ్రభాగాన నిలిచారని, 4,500 మందికి పైగా చిన్నారులకు గుండె చికిత్సలు చేపించి ఆయా కుటుంబాలకు దేవుడిగా నిలిచారని కొనియాడారు. అనంతరం కేక్ కట్ చేసి, ప్రయాణికులకు చికెన్ బిర్యానీ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కృష్ణ మహేష్ యువసేన జిల్లా అధ్యక్షుడు కనగాల రాంబాబు, సీనియర్ అభిమాని రాపాక కాంతరాజు, పట్టణ అధ్యక్షుడు పాషా, పట్టణ ఉపాధ్యక్షుడు ఎండి మసూద్, అభిమానులు పెద్దిరాజు, కాంపాటి ప్రసాద్, ఫణి, రమేష్, సురేష్, రవీందర్, మహేష్, సంజు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment