చదువే మనిషికి ఆస్తి..దేవుడిచ్చిన వరం - కొత్వాల శ్రీనివాసరావు

చదువే మనిషికి ఆస్తి..దేవుడిచ్చిన వరం - కొత్వాల శ్రీనివాసరావు
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: చదువే మనిషికి ఆస్తి అని, అది దేవుడిచ్చిన వరమని రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు తెలిపారు.

పాల్వంచ మండల పరిధి దంతేలబోర గ్రామానికి చెందిన న్యాయవాది కాటూరి సంజీవరావు కుమార్తె కాటూరి బిందు  హైదరాబాద్ (సిటీ సివిల్ కోర్ట్) 7వ ఆదనపు జూనియర్ సివిల్ జడ్జి గా నియామకమైన సందర్భంగా, ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

పాల్వంచ మునిసిపాలిటీ పరిధిలోని ఇందీరాకాలనీ లోని సంజీవరావు స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బిందును కొత్వాల శ్రీనివాసరావు శాలువా కప్పి సత్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామంలో పుట్టి న్యాయవాద వృత్తిని చేపట్టి జడ్జి స్థాయికి ఎదిగిన బిందు అభినందనీయురాలు అని పేర్కొన్నారు. ఆమె మరెన్నో పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, కాంగ్రెస్ నాయకులు ఉండేటి శాంతివర్ధన్, కొత్తపల్లి సోమయ్య, కాపర్తి వెంకటాచారి, అలెక్స్, కటుకూరి శేఖర్, కొత్తపల్లి రవి, షేక్ బాషా, జగన్నాథం అజిత్, చింతలచెరువు రమేష్, సైదులు, చింతలచెరువు వేణు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.