రాష్ట్రంలో భారీ వర్షాలు.. పాఠశాలలకు సెలవు

 

రాష్ట్రంలో భారీ వర్షాలు.. పాఠశాలలకు సెలవు

జె.హెచ్.9.మీడియా, హైదరాబాద్ :   తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లడం, రోడ్లలో నీటి నిల్వలు ఏర్పడడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదల ధాటికి పలువురు గల్లంతయ్యారు. వివిధ జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.


ఇక నేడు రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. దీంతో నల్గొండ, యాదాద్రి, కరీంనగర్, సిద్దిపేట, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

Blogger ఆధారితం.