కామ్రేడ్ ఉప్పు శెట్టి ఖాదర్ బాబు మనవరాలికి నంది అవార్డు

 

కామ్రేడ్ ఉప్పు శెట్టి ఖాదర్ బాబు మనవరాలికి నంది అవార్డు

  • కూచిపూడిలో ఆకాంక్ష ప్రతిభ
  • కామ్రేడ్ ఉప్పు శెట్టి ఖాదర్ బాబు మనవరాలికి నంది అవార్డు
  • ఉప్పుశెట్టి ఆకాంక్షను అభినందించిన ఎమ్మెల్యే


జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: 
 సిటిజెన్ ఆఫ్ వెల్ఫేర్ అండ్ ఇండియా కల్చరల్ ఆధ్వర్యంలో ఇటీవల తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో నిర్వహించిన నాట్య నిరంజనం కూచిపూడి నృత్య ప్రదర్శనలో పాల్వంచకు చెందిన దివంగత ప్రముఖ న్యాయవాది, మాజీ మున్సిపల్ కౌన్సిలర్, సిపిఐ ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ సమితి సభ్యులు కామ్రేడ్ ఉప్పు శెట్టి ఖాదర్ బాబు మనవరాలు ఉప్పు శెట్టి ఆకాంక్ష ప్రతిభ కనబరిచి నంది అవార్డును అందుకున్నారు.

ఈ అవార్డును రాష్ట్రపతి అవార్డు గ్రహీత డా. వేదాంతం రాదేశాం, అన్నమయ్య వారసుడు తాళ్లపాక హరిహర నారాయణచార్యులు కలిసి ప్రదానం చేశారు. ఆకాంక్షకు జై సంతోషిమాత నాట్య నిలయం గురువు టీ. వరలక్ష్మి శిక్షణ అందించారు.

ఈ సందర్భంగా కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. షాబీర్ పాషా, నవభారత్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎన్.వి.కే. ప్రసాద్ బుధవారం ఆకాంక్షను అభినందించారు.




Blogger ఆధారితం.