వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన కాంపెల్లి కనకేష్ పటేల్
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: పాల్వంచ కిన్నెరసాని రోడ్‌లోని ఆర్ఆర్ నేత్రాలయ కంటి హాస్పిటల్ 9 వసంతాలు పూర్తి చేసుకొని 10వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి కనకేష్ పటేల్ ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యం తయారు చేసిన వినాయక మట్టి విగ్రహాలను ఆయన పంపిణీ చేశారు.
అనంతరం కాంపెల్లి కనకేష్ పటేల్ మాట్లాడుతూ ఆర్ఆర్ నేత్రాలయ కంటీ హాస్పిటల్ పాల్వంచలో ఏర్పాటు అయి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసినందున, ఈ కాలంలో అనేక పేదలకు ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించినట్లు గుర్తు చేశారు. డాక్టర్ అలుమోలు భగవాన్, డాక్టర్ వనపర్తి హరికృష్ణ, డాక్టర్ అశోక్ లకు పేద ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అన్నారు.
అదేవిధంగా, ఆర్ఆర్ నేత్రాలయ కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆగస్టు 26 - 28 వరకు ఉచిత కంటి పరీక్షా శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ శిబిరం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు, ఏ విధమైన ఫీజు లేకుండా, కంప్యూటర్ ఆధారిత ఉచిత కంటి పరీక్షలను అందిస్తోందన్నారు. కాంపెల్లి కనకేష్ పటేల్ ప్రజలను ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ అలుమోలు భగవాన్, డాక్టర్ వనపర్తి హరికృష్ణ, డాక్టర్ అశోక్, చింతా నాగరాజు, ఆకుల ఆనంద్, కేసరి రాజేష్, కొండపల్లి సతీష్, సిద్ధాని సూర్య, చింతమల్ల గ్లోరీ, బాహటం సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment