షేక్ ఖాసిం ఆధ్వర్యంలో దివ్యాంగులకు బియ్యం పంపిణీ


షేక్ ఖాసిం ఆధ్వర్యంలో దివ్యాంగులకు బియ్యం పంపిణీ

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను న్యూ పాల్వంచ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు షేక్ ఖాసిం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వెంకటేశ్వర థియేటర్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో నిరుపేద దివ్యాంగులకు, పేదలకు.. తైక్వాండో ప్లేయర్ సింధు తపస్వి చేతుల మీదుగా బియ్యం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ “ఖాసిం ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందదాయకం” అని అన్నారు. “ఖాసిం మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తున్నాం” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాకలపాటి రోషయ్య చౌదరి, పెదబాబు, రామ్మోహన్ రెడ్డి, బ్రహ్మం, పరంకుశం సాయి తేజ, నయీమ్, లఘుపతి, రసూల్, భాషా, భాను, మల్లికార్జున స్వామి తదితరులు పాల్గొన్నారు.



Blogger ఆధారితం.