ACBకి చిక్కిన మోటర్ వాహన ఇన్స్పెక్టర్

జామాబాద్: వాహనాల రిజిస్ట్రేషన్, లైసెన్స్‌ల పునరుద్ధరణ, లెర్నింగ్ లైసెన్స్‌ల జారీ వంటి సేవల కోసం ఫిర్యాదుదారుని నుండి రూ.25 వేలు లంచం స్వీకరిస్తూ ఆర్మూర్‌ మోటారు వాహన ఇన్స్పెక్టరు గుర్రం వివేకానందరెడ్డి, అతని వ్యక్తిగత డ్రైవర్‌ తిరుపతి గురువారం తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు.

ప్రజలకు అందించాల్సిన సేవలను ఉద్దేశపూర్వకంగా పెండింగ్‌లో ఉంచకుండా చేయడానికిగాను ఈ లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు ఎసీబీ పేర్కొంది.

ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం డిమాండ్ చేసినట్లయితే వెంటనే టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1064 కు కాల్‌ చేయాలని, అదేవిధంగా వాట్సాప్‌ (9440446106), ఫేస్‌బుక్‌ (Telangana ACB), ఎక్స్‌ (@TelanganaACB) మరియు వెబ్‌సైట్‌ (acb.telangana.gov.in) ద్వారా కూడా సమాచారం అందించవచ్చని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎసీబీ భరోసా ఇచ్చింది.
Blogger ఆధారితం.