నాలుగేళ్ల విరామం తర్వాత మోగిన బడిగంటలు

నాలుగేళ్ల విరామం తర్వాత మోగిన బడిగంటలు

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: పాల్వంచ మండలంలోని బోజ్యతండా గ్రామంలో నాలుగేళ్లుగా మూతపడ్డ ప్రాథమిక పాఠశాలను శుక్రవారం తిరిగి ప్రారంభించారు. పాల్వంచ మండల ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా పాఠశాల పునఃప్రారంభం జరిగింది.

గ్రామంలో బడి వయస్సు కలిగిన పిల్లలు లేకపోవడంతో పాఠశాలను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల విద్యాశాఖ కమిషనర్ జిల్లా పర్యటన సందర్భంగా మూతబడిన పాఠశాలను తిరిగి ప్రారంభించాలని ఆదేశాలు ఇవ్వడంతో, అధికారులు గ్రామంలో సర్వే నిర్వహించి విద్యార్థులను గుర్తించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని సూచించారు. ఇంగ్లీష్ మీడియం బోధన సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు.

కార్యక్రమంలో ఎంఈఓ ఏ.శ్రీరామ్మూర్తి, ఉపాధ్యాయులు గీతా కుమారి, ఎం.వెంకటేశ్వర్లు, బి.శ్రీనివాస్ బిక్షం, రాజులు, సిఆర్పి శ్రీనివాస్ రావు, గ్రామ పెద్దలు నూనావత్ బాబు, ధర్మసోత్ ఉపేందర్, రాంబాబు, రాము, ఆంగోతు లచ్చు తదితరులు పాల్గొన్నారు.



Blogger ఆధారితం.