హత్య కేసులో వ్యక్తికి జీవిత ఖైదు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: హత్య కేసులో వ్యక్తికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మంగళవారం తీర్పు చెప్పారు.
కేసు వివరాలు ఇలా ఉన్నాయి..అశ్వారావుపేట పరిధి తిరుమలకుంటకు చెందిన లింగాల చక్రధరరావు (ఆర్‌ఎంపీ డాక్టర్) 2022 డిసెంబర్ 8న దురదపాడు నుంచి పేషెంట్ వైద్యం చేయడానికి వెళ్లి తీరిగి రాలేదు. చక్రధరరావు కు అతని భార్య పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో భార్య జయలక్ష్మి, కూతురు ప్రభావతి వెతకడం ప్రారంభించారు.
వినాయకపురంలోని ఓ మామిడి తోట సమీపంలో చక్రధరరావు మృతదేహం కనిపించింది. కుడి భుజంపై పదునైన ఆయుధంతో నరికి హత్య చేసారు. జయలక్ష్మి ఫిర్యాదు మేరకు అశ్వారావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తదుపరి దర్యాప్తులో తుమ్మలకుంట నివాసి షేక్ నసీర్ @ నజీర్ @ థంగ్లి ఈ హత్య చేసినట్టు తేలడంతో అప్పటి సిఐ బి. బాలకృష్ణ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. 22 మంది సాక్షుల వాంగ్మూలాల అనంతరం ఇరు పక్షాల వాదనలు విని కోర్టు నిందితుడిపై నేరం రుజువై జీవిత ఖైదుతో పాటు రూ.1,000 జరిమానా విధించింది.
ప్రాసిక్యూషన్‌ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.వి.డి. లక్ష్మి నిర్వహించారు. దర్యాప్తులో అశ్వారావుపేట సబ్‌ఇన్స్పెక్టర్లు వై. రాజు, బి. రాజేష్ కుమార్, కోర్టు నోడల్ ఆఫీసర్ డి. రాఘవయ్య, లైజన్ ఆఫీసర్ ఎన్. వీరబాబు, కోర్టు డ్యూటీ ఆఫీసర్ బి. నాగేశ్వరరావు సహకరించారు.

Post a Comment