మున్నూరు కాపులకు అండగా ఉంటాం - కాంపెల్లి కనకేష్ పటేల్
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: పాల్వంచ మండలం సత్యనారాయణపురం (మొండికట్ట) గ్రామానికి చెందిన మున్నూరు కాపు సంఘం సభ్యుడు కుడక వెంకన్న అనారోగ్య సమస్యలతో ఈనెల 24న మృతి చెందారు. ఆర్థికంగా అత్యంత నిరుపేద కుటుంబం కావడంతో దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేక, గ్రామస్థులు విరాళాలు సమకూర్చి అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ విషయాన్ని తెలంగాణ మున్నూరు కాపు పటేల్స్ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కాంపెల్లి కనకేష్ పటేల్ దృష్టికి తీసుకురాగానే ఆయన వెంటనే స్పందించారు. సంఘం వాట్సాప్ గ్రూప్ ద్వారా సభ్యులకు సమాచారం అందించగా, వారు ముందుకొచ్చి రూ.27,816/- విరాళాలు సమకూర్చారు. ఈ మొత్తాన్ని సోమవారం మృతుడు వెంకన్న కుటుంబానికి సంఘం నాయకులు అందజేశారు.
ఈ సందర్భంగా కనకేష్ పటేల్ మాట్లాడుతూ “పాల్వంచ పట్టణ, మండలాలలోని మున్నూరు కాపులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా అండగా ఉంటామని అన్నారు. పేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడం తమ బాధ్యత” అని స్పష్టం చేశారు. గతంలో కూడా జగన్నాధపురం గ్రామ శ్రావణపు పెద్దులు, సోములగూడెం గ్రామ పెద్దినీటి అనసూయ, పాల్వంచ పట్టణ కోలా అంజన్‌రావు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించామని గుర్తుచేశారు.
విరాళాలు అందించిన చింతా నాగరాజు, ఆకుల ఆనంద్, మద్దుల వీరమోహన్‌రావు, ఎడవల్లి నవీన్, యామినేని ఉప్పల్‌రావు, వీసంశెట్టి విశ్వేశ్వరరావు, తోట మల్లేశ్వరరావు, గంధం నరసింహారావు, కనకం రామయ్య, ముళ్లపాటి శ్రీకాంత్ తదితరులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు చింతా నాగరాజు, ఆకుల ఆనంద్, పూజల ప్రసాద్, తోట లోహిత్ సాయి, అలాగే సత్యనారాయణపురం గ్రామస్తులు అన్నం ప్రభాకర్, బండారి వేణు, బండి వెంకన్న, మద్దిరాల అశోక్, దేశెట్టి కృష్ణయ్య, కుడక వెంకన్న కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment