జిల్లా ప్రధాన న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసిన అహ్మద్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: : ప్రముఖ సామాజిక సేవా సంస్థ నేతాజీ యువజన సంఘం సేవా ప్రస్థానం 32 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్.జె.కె. అహ్మద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.
జిల్లా జడ్జి పాటిల్ వసంత్ నేతాజీ యువజన సంఘం చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం స్పెషల్ జుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు, ఇతర న్యాయవర్గ ప్రతినిధులు పాల్గొన్నారు.

Post a Comment