సినీ రంగంలోకి అడుగుపెడుతున్న పాల్వంచ బిడ్డ
జె.హెచ్.9. మీడియా, హైదరాబాద్: ఆల్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) పాల్వంచ కార్యదర్శి కోరే కృష్ణ కుమారుడు చిన్ను హీరోగా పరిచయం అవుతున్న తొలి చిత్రం ‘లవ్ యూ రా’ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. సముద్రాల సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై గీతికా రతన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం హర్రర్, లవ్, కామెడీ అంశాలతో కూడిన పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపొందింది. ప్రసాద్ ఏలూరి దర్శకత్వం వహిస్తుండగా, సముద్రాల మంత్రయ్య బాబు, కొన్నిపాటి శ్రీనాథ్ ప్రజాపతి నిర్మాతలుగా వ్యవహరించారు.
మంగళవారం హైదరాబాద్ లో జరిగిన ఆడియో లాంచ్ వేడుకలో ‘ఏ మాయ చేశావే పిల్లా’, ‘వాట్సప్ బేబీ’, ‘యూత్ అబ్బా మేము’, ‘దైవాన్నే అడగాలా’ పాటలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా హీరో చిన్ను మాట్లాడుతూ ‘‘‘లవ్ యూ రా’ నా తొలి చిత్రం. ఈ అవకాశాన్ని ఇచ్చిన మా దర్శకుడు ప్రసాద్ ఏలూరికి, నిర్మాతలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అని అన్నారు. ఈ ప్రయాణంలో నా వెన్నంటే నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నన్ను నమ్మి ఈ పాత్రకు ఎంపిక చేసిన డైరెక్టర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలిపారు.
‘లవ్ యూ రా’ ఆద్యంతం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఉంటుందన్నారు. హీరోయిన్ గీతిక తన పాత్రకు జీవం పోశారు. కృష్ణ సాయి క్యారెక్టర్ ప్రేక్షకులను అలరిస్తుందన్నారు . చంద్రశేఖర్ పాత్ర కూడా చాలా బాగా వచ్చిందన్నారు. తమ చిత్రంలో హారర్, కామెడీ, లవ్ అన్ని అంశాలు సమపాళ్లలో ఉంటాయి అని అన్నారు. సంగీత దర్శకుడు ఈశ్వర్ అందించిన పాటలు చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయ అని ఆయన స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 5న తమ సినిమా విడుదల కానుంది. మీడియా సపోర్ట్ ఉంటేనే తమలాంటి కొత్తవాళ్లు ప్రేక్షకుల హృదయాలలోకి చేరగలుగుతాం అని అన్నారు. తమ చిత్రాన్ని అందరూ ఆదరించి విజయవంతం చేయాలని చిన్ను కోరారు. ఈ సందర్భంగా
హీరోయిన్ గీతిక, నిర్మాత శ్రీనాథ్ ప్రజాపతి, దర్శకుడు ప్రసాద్ ఏలూరి, నటీనటులు కృష్ణ సాయి, చంద్రశేఖర్ రావు, నాగేష్, నాగతేజ మాట్లాడుతూ ప్రజలందరూ తమని ఆశీర్వదించి సినిమాని ఘన విజయం చేయాలని కోరారు.
‘లవ్ యూ రా’ గ్రామీణ నేపథ్యంలోని వినోదాత్మక ప్రేమకథగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుందని యూనిట్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.

.webp)
Post a Comment