కేంద్ర రైల్వే సహాయ మంత్రిని కలిసిన డాక్టర్ నిజాముద్దీన్.

కేంద్ర రైల్వే సహాయ మంత్రిని కలిసిన డాక్టర్ నిజాముద్దీన్.
జె.హెచ్.9. మీడియా, న్యూఢిల్లీ:  కేంద్ర రైల్వే సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు ను గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత డాక్టర్ మహమ్మద్ నిజాముద్దీన్ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ఢిల్లీలో పర్యటించిన డాక్టర్ నిజాముద్దీన్...కేంద్ర రైల్వే సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టును ఆయన కార్యాలయంలో కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా నిజాముద్దీన్ పలు సమస్యలను రైల్వే సహాయ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. హైదరాబాద్ నగరానికి తప్పకుండా హాజరై తమ ఆతిథ్యాన్ని స్వీకరించాలని ఆయనను కోరారు. నిజాముద్దీన్‌తో పాటు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ తదితరులు ఉన్నారు.

Blogger ఆధారితం.