ఒవైసీ ఫాతిమా కాలేజీపై హైడ్రా క్లారిటీ

ఒవైసీ ఫాతిమా కాలేజీపై  హైడ్రా క్లారిటీ
జె.హెచ్.9. మీడియా, హైదరాబాద్ : సలకం చెరువు ప్రాంతంలో ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఫాతిమా కాలేజీపై ఇప్పటివరకు కూల్చివేత చర్యలు చేపట్టకపోవడంపై హైడ్రా స్పష్టతనిచ్చింది. పేద ముస్లిం మహిళలకు విద్య అందించే సంస్థ కావడంతో కాలేజీపై మినహాయింపు ఇచ్చినట్టు అధికారులు వెల్లడించారు.

"ఈ కాలేజీ ఎఫ్.టి.ఎల్  పరిధిలో ఉన్న భవనంలో నడుస్తోంది. గత సెప్టెంబర్ లో తొలగించే యత్నం చేయాలని భావించినా, పేద బాలికలు–మహిళలు ఉచితంగా విద్యాభ్యాసం చేస్తున్న దృష్ట్యా చర్యలను నిలిపివేశాం" అని హైడ్రా వర్గాలు తెలిపాయి.

ఈ కాలేజీలో కేజీ నుండి పీజీ వరకు 10,000 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఫీజులు లేకుండా విద్యనందిస్తున్న ఈ సంస్థ పేద ముస్లింల సామాజిక, విద్యా అభివృద్ధికి దోహదపడుతోందని తెలిపారు.

అయితే, ఇతర ఎంఐఎం నేతల అక్రమ కబ్జాలపై మాత్రం హైడ్రా కఠినంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేసింది. ఇప్పటివరకు దాదాపు ₹1,000 కోట్ల విలువైన ఆస్తులను రికవరీ చేసినట్టు వెల్లడించారు.

Blogger ఆధారితం.