వసతిగృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన న్యాయాధికారి రాజేందర్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయాధికారి ఎం. రాజేందర్ మంగళవారం పడమటి నర్సాపురంలోని అశ్రమ గర్ల్స్ హై స్కూల్, పోస్టుమెట్రిక్ గిరిజన బాలికల వసతిగృహం, వేపలగడ్డలో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరాతీశారు. మెనూ ప్రకారం ఆహారాన్ని అందించడంలో పాటించాల్సిన ప్రమాణాలు పాటించాలనే విషయాన్ని గుర్తుచేసి, నాణ్యమైన విద్య మెరుగైన సదుపాయాలు కల్పించాలని వార్డెన్లకు సూచించారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి తరగతి గదులు, కిచెన్ రూం, స్టోర్ రూం లను పరిశీలించారు. హాస్టల్ పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, సౌచాలయాలను శుభ్రంగా ఉంచాలని హాస్టల్ ప్రిన్సిపాల్, వార్డెన్‌లను ఆదేశించారు.

Post a Comment