పాల్వంచలో కార్మిక సంఘాల భారీ ర్యాలీ

పాల్వంచలో కార్మిక సంఘాల భారీ ర్యాలీ

 జె.హెచ్.9. మీడియా, భద్రాద్రి కొత్తగూడెం : కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం పాల్వంచ పట్టణంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న ర్యాలీ నిర్వహించారు. నాలుగు లేబర్ కోడ్ చట్టాలను వెనక్కి తీసుకోవాలని, కార్మిక హక్కులను కాలరాసే చట్టాలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పాల్వంచ అంబేద్కర్ సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ నటరాజ్ సెంటర్, శాస్త్రి బొమ్మ సెంటర్, రాజీవ్ గాంధీ మార్కెట్, బస్ స్టాండ్ సెంటర్‌ల ద్వారా సాగి తహసీల్దార్ కార్యాలయం వద్ద ముగిసింది. అనంతరం పలు  డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు నాయకులు అందజేశారు.

ఈ ర్యాలీలో  ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ, టీయూసీఐ, ఐఎఫ్‌టీయూ వంటి కార్మిక సంఘాలు, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, సీపీఐ ఎంఎల్ పార్టీ, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు ముత్యాల విశ్వనాథం, బండి నాగేశ్వరరావు, అడుసుమిల్లి సాయిబాబు, దొడ్డ రవికుమార్, ఎం.జ్యోతి, తులసిరామ్, నూకల రంగారావు, బానోత్ బాలునాయక్, ఎన్.భూషణం, షరీఫ్, కల్లూరి కిషోర్, వెంకటేశ్వర్లు, వీసంశెట్టి పూర్ణచందరరావు, పద్మజ, అన్నారపు వెంకటేశ్వర్లు, ఇట్టి వెంకట్రావు, నరహరి నాగేశ్వరరావు, శనిగారపు శ్రీనివాస్, నిమ్మల రాంబాబు, వేములపల్లి శ్రీనివాస్, జి.వెంకన్న, కోరే కృష్ణ, జీ.రవి, వి.రవి, హమాలి వెంకన్న, ఎస్‌కే.రెహమాన్, వై.ప్రభావతి, శంకర్, కృష్ణ, సంజీవరావు, రామారావు, బి.నాగేశ్వరరావు, కె.సత్య, వి.సత్యవాణి, బి.క్రాంతి, కె.వెంకటేశ్వర్లు, పి.వెంకట్రావు, రాందాస్, జి.రమేష్, వి.రమేష్, నీలం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.