రాజీపడని రాజమల్లు.. ప్లీడర్ టు మెజిస్ట్రేట్
జె.హెచ్.9. మీడియా,వెబ్ డెస్క్ : కొత్తగూడెం స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న మెండు రాజమల్లును మంగళవారం తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు సెక్రటరీ జనరల్ ఎస్. మధుసూదన్ రావు (చిన్ని), స్థానిక న్యాయవాదులు ఎం.ఏ. రజాక్, ఎర్రా శ్రీనివాస్ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు..
ఈ సందర్భంగా ఆయనకు శాలువాలు కప్పి, మిఠాయిలు తినిపించి, శుభాకాంక్షలు తెలిపారు.
ప్లీడర్ టు మెజిస్ట్రేట్ :
న్యాయవాదిగా తన కెరీర్‌ను ప్రారంభించిన రాజమల్లు కేసుల పరిష్కారంలో ఎన్నో సవాలను అధిగమించి పేదల పక్షాన నిలబడిన ఈయన రాజీపడని రాజమల్లు గా పేరుపొందారు. 1998లో బార్ కౌన్సిల్‌లో చేరిన ఆయన అప్పటినుండి ఇప్పటివరకు తను నమ్మిన సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఎన్నో క్లిష్టమైన కేసుల పరిష్కారం చేసిన ఘనత దక్కించుకున్నారు. బెదిరింపులకు భయపడకుండా, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తనదైన మార్క్ చాటున్నారు. సీనియర్ న్యాయవాది దివంగత సానికొమ్ము కాశిరెడ్డికి జూనియర్‌గా పనిచేసి పలు కీలక కేసుల్లో ప్రతిభ చూపారు.
కేటీపీఎస్ స్టాండింగ్ కౌన్సిల్ కు లీగల్ అడ్వైజర్ కు జూనియర్ గా పనిచేస్తూ, సంస్థకు సంబంధించిన పలు కేసుల్లో విజయం సాధించారు.
గతంలో భద్రాద్రికొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, ఎస్పీ డాక్టర్ వినీత్, ఎమ్మెల్యే జారే ఆదినారాయణల చేతులమీదుగా ప్రభుత్వ అవార్డులు అందుకున్నారు. అనంతరం ప్రస్తుత భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్, కలెక్టర్ జితేష్ వి. పాటిల్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ల నుంచి కూడా అవార్డులు అందుకున్నారు.
హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా చేతుల మీదుగా "న్యాయశ్రీ" అవార్డు అందుకున్నారు.
మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు న్యాయవృత్తితో పాటుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుకైన పాత్ర పోషిస్తూ ఉంటారు. గతంలో భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన నేతాజీ యువజన సంఘం కి లీగల్ అడ్వైజర్ గా విశేష సేవలందించారు.
ఇక టిఎస్ ఆర్టిసి జిల్లా స్టాండింగ్ కౌన్సిల్ గా పనిచేసిన అనుభవం ఈయన సాంతం. శ్రీనగర్ లయన్స్ క్లబ్ మెంబెర్ గా అనేక సేవా కార్యక్రమాలు చేసారు.
ప్రస్తుతం కొత్తగూడెంలో స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న రాజమల్లును న్యాయవాద వృత్తికి తలమానికంగా అభివర్ణిస్తూ, యువ న్యాయవాదులు ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని మధుసూదన్ రావు (చిన్ని), ఇతర న్యాయవాదులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల మహానాడు కార్యదర్శి కూరపాటి రవీందర్, జిల్లా అధ్యక్షురాలు సృజన, బీసీ సంఘం జిల్లా నేత జాన్సన్ సుధాకర్, జే. శ్రీనివాస్, న్యాయవాదులు ఎర్రపాటి కృష్ణ, దూడెం మురళి కృష్ణ, ఎన్.శోభారాణి, పాషా తదితరులు పాల్గొన్నారు.

Post a Comment