అహలే సున్నత్వల్ జామాత్ ఆధ్వర్యంలో మొహర్రం షర్బత్ పంపిణీ
జె.హెచ్.9. మీడియా, కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని జామియా మసీద్‌లో ఆదివారం మొహర్రం పదవ రోజు సందర్భంగా షర్బత్ పంపిణీ కార్యక్రమాన్ని అహలే సున్నత్వల్ జామాత్ (ఏ.ఎస్.జే) జిల్లా కమిటీ ఘనంగా నిర్వహించింది.
ఈ కార్యక్రమాన్ని ఏ.ఎస్.జే జిల్లా అధ్యక్షుడు షేక్ కరీం ఖాద్రీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కర్బలా యుద్ధంలో మానవ హక్కుల పరిరక్షణ కోసం ఇమామ్ హుస్సేన్ తన 72 మంది అనుచరులతో కలిసి వీర మరణం పొందిన ఈ రోజు తమ త్యాగాలను స్మరించుకోవడానికి ఈ షర్బత్ పంపిణీ చేపట్టినట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో మౌలానా నయ్యర్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆషురా నమాజ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షులు మహమ్మద్ గౌస్ మోహినుద్దీన్, ప్రధాన కార్యదర్శి షేక్ యఖుబ్ ఖాద్రీ, కోశాధికారి సయ్యద్ యఖుబ్ ఉద్దీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ హుస్సేన్ ఖాన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మహమ్మద్ షమీ, మహమ్మద్ షఫీ, మౌలానా నయ్యర్, సెక్రటరీ జనరల్స్ మహబూబ్ ఖాద్రీ, అలీం ఉద్దీన్, సభ్యులు మదీన అక్తర్, మహమ్మద్ ఖాజా ఖాన్, ఆసిఫ్, షమ్షు, నీసార్, సలీం, మహమ్మద్ నయిం చిష్తీ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment