ప్రజానాట్యమండలి నూతన జిల్లా కమిటీ ఎన్నిక

ప్రజానాట్యమండలి నూతన జిల్లా కమిటీ ఎన్నిక

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  తెలంగాణ ప్రజానాట్యమండలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూడో మహాసభలు పాల్వంచలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన కళాకారుల సమక్షంలో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. మొత్తం 9 మంది సభ్యులతో కూడిన కొత్త కార్యవర్గం గురువారం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా సీనియర్ కళాకారుడు రామదాసు గౌరవ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. పాల్వంచకు చెందిన శనిగారిపు శ్రీనివాస్ జిల్లా అధ్యక్షుడిగా, కాటూరి రాము జిల్లా  ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షులుగా పండగ రాంబాబు, మేదిని లక్ష్మి, కార్యదర్శులుగా నిమ్మల రాంబాబు, కోటగుర్తి శ్రీనివాస్, కనకం కొమరయ్య ఎన్నికయ్యారు. కోశాధికారిగా దార్ల లక్ష్మి బాధ్యతలు చేపట్టారు.

కార్యవర్గ సభ్యులుగా మణుగూరుకు చెందిన రాయల బిక్షం, లక్ష్మీదేవిపల్లికి చెందిన జోడ శ్రీను, పాల్వంచకు చెందిన కృష్ణ, రామాచారి, బిక్కులాల్, అల్లి వెంకటేశ్వర్లు, రాజేశ్వరి, సత్య శ్రీను, జశ్వాపురానికి చెందిన కాకటి స్వరూప, కొత్తగూడెంకు చెందిన విజయలక్ష్మి, కొత్తపల్లికి చెందిన వెంకన్న, రామారావు, పగిడిపల్లి సంజీవరావులను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.


Blogger ఆధారితం.