ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌ కార్మికుల పక్షపాతి: దేవీలాల్ నాయక్‌

ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌ కార్మికుల పక్షపాతి: దేవీలాల్ నాయక్‌

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: ఎమ్మెల్యే  రాందాస్ నాయక్  కార్మికుల పక్షపాతి అని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్‌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి దేవీలాల్ నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం  పాల్వంచ పట్టణంలోని పూర్ణ సెంటర్‌లో కేటీపీఎస్ 6వ దశ నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా దేవీలాల్ నాయక్, పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల రంగారావుతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దేవీలాల్ నాయక్‌ మాట్లాడుతూ “కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే రాందాస్ నాయక్ నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. కేటీపీఎస్ నిర్మాణ కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి, ఉద్యోగ అవకాశాల కల్పనపై కృషి చేస్తారని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన నాయకులు భరత్ నాయక్, శివ నాయక్, రెడ్డ్యా నాయక్, జేఏసీ అధ్యక్షుడు హతీరామ్ నాయక్, ఉపాధ్యక్షుడు మురళీకృష్ణ, కన్వీనర్ లక్ష్మణ్ నాయక్, కో కన్వీనర్ చంటి, సభ్యులు సుశీల, సాలూకు, నాగమణి, కిరణ్, శివ, సాయిరాం, సతీష్ తదితరులు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.