ఫేక్ లా సర్టిఫికెట్లతో అడ్వకేట్లుగా ఎన్రోల్..9 మందిని తొలగించిన స్టేట్ బార్ కౌన్సిల్

ఫేక్ లా సర్టిఫికెట్లతో అడ్వకేట్లుగా ఎన్రోల్..9 మందిని తొలగించిన స్టేట్ బార్ కౌన్సిల్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: నకిలీ విద్యా సర్టిఫికెట్ల ఆధారంగా న్యాయవాదులుగా నమోదు అయిన తొమ్మిది మందిని బహిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కౌన్సిల్ సెక్రటరీ జూన్ 2న ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. న్యాయవృత్తి ప్రతిష్టకు భంగం కలిగించేలా నకిలీ ధ్రువపత్రాలతో న్యాయవాదులుగా నమోదు కావడం పట్ల కౌన్సిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.


తొలగించబడినవారిలో టీఎస్/1359/2008 నంబర్‌తో నమోదైన అజర్ శ్రావణ్ కుమార్, టీఎస్/1206/2014 నంబర్‌తో ఎం.సురేఖా రమణి, టీఎస్/2892/2016 నంబర్‌తో ఎన్.విద్యా సాగర్, టీఎస్/2896/2016 నంబర్‌తో పి.సిసిల్ లివింగ్స్టన్, టీఎస్/728/2017 నంబర్‌తో సతీష్ కనకట్ల, టీఎస్/1214/2017 నంబర్‌తో నరేష్ సుంకర, టీఎస్/1354/2019 నంబర్‌తో రాజశేఖర్ చిలక,
టీఎస్/1565/2019 నంబర్‌తో శ్రీశైలం కె, 663/3626/2018 నంబర్‌తో ఎ.ఉదయ్ కిరణ్ ఉన్నారు.


Blogger ఆధారితం.