భద్రాచలం ఈవో పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి -కాపర్తి వెంకటాచారి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం దేవస్థానం ఈవో రమాదేవిపై జరిగిన దాడిని విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు కాపర్తి వెంకటాచారి తీవ్రంగా ఖండించారు. బుధవారం ఆయన పాల్వంచ ప్రెస్ క్లబ్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కాపర్తి వెంకటాచారి మాట్లాడుతూ భద్రాచలం దేవస్థానం భూములపై తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల మేరకు మంగళవారం ఆలయ ఈవో రమాదేవి భూములను పర్యవేక్షిస్తుండగా, పురుషోత్తంపట్నం గ్రామస్తులు దాడికి పాల్పడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని, ఆలయ భూములను ప్రభుత్వం పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపేంద్ర చారి, పారిపర్తి వెంకటేశ్వర్లు, మస్నా శ్రీనివాసరావు, వాసుమల్ల సుందరరావు, దారా చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment