పెండింగ్ కేసుల పరిష్కారం కోసం 90 రోజుల మధ్యవర్తిత్వం డ్రైవ్

పెండింగ్ కేసుల పరిష్కారం కోసం 90 రోజుల మధ్యవర్తిత్వం డ్రైవ్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: జిల్లావ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించడానికి జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు 90 రోజులపాటు మధ్యవర్తిత్వం డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మరియు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ "దేశం కోసం మీడియేషన్" అనే పేరుతో ఈ డ్రైవ్‌ను నల్సా, న్యూఢిల్లీ, సుప్రీంకోర్టు మీడియేషన్ అండ్ కన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తుందని చెప్పారు.

మధ్యవర్తిత్వం ద్వారా కక్షిదారులకు డబ్బు, సమయం ఆదా కావడంతోపాటు సత్వర న్యాయ పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.

ఈ డ్రైవ్‌లో వివాహ బంధానికి సంబంధించిన వివాదాలు, ప్రమాద క్లైంలు, గృహ హింస కేసులు, చెక్ బౌన్స్ కేసులు, సివిల్ మరియు క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, రుణ రికవరీ కేసులు వంటి వాటిని పరిష్కరించుకోవచ్చని తెలిపారు.

కావున కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Blogger ఆధారితం.