కేంద్ర ప్రభుత్వ పెండింగ్ నోటరీలను వెంటనే బర్తీ చేయలి : ఐ.యల్.పి.ఏ.
కొత్తగూడెం బార్ అసోసియేషన్ లైబ్రరీ హాల్‌లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రామచంద్రరావుకు ఐ.ఎల్.పి.ఏ. జిల్లా కమిటీ కన్వీనర్ జనపరెడ్డి గోపికృష్ణతోపాటు న్యాయవాదులు సుంకర భానుప్రియ, మహమ్మద్ సాదిక్ పాషా, యన్. ఉషారాణి, వడ్లకొండ హరి, దేవేంద్ర వర ప్రసాద్, అంకుష్ పాషా, వి. రాజేశ్వరరావు తదితరులు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా జనపరెడ్డి గోపికృష్ణ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. కేంద్ర న్యాయశాఖ అధికారులతో చర్చించి పెండింగ్‌లో ఉన్న నోటరీలను వెంటనే భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిదంగా కొత్త నోటరీ నోటిఫికేషన్ విడుదలకు కృషి చేయాలని ఆయన తెలిపారు.
అనంతరం సానుకూలంగా స్పందించిన రామచంద్రరావు, సమస్య పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారని జనపరెడ్డి గోపికృష్ణ వెల్లడించారు.

Post a Comment