పాల్వంచలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

పాల్వంచలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:   బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను గురువారం పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్, పట్టణ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు మంతపురి రాజు గౌడ్ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా  నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు పూర్ణ టీ స్టాల్ లో కేక్ కట్ చేసి పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పాలు, పండ్లు,రొట్టెలను పంపిణీ చేశారు.

 అనంతరం కనకేష్ పటేల్, రాజు గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వెన్నంటి నిలబడిన కేటీఆర్ అలుపెరుగని పోరాటాలు చేశారు అని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాలు మున్సిపల్, ఐటీ శాఖల మంత్రిగా పనిచేసి తెలంగాణను దేశంలో ఐటీ రంగంలో అగ్రస్థానంలో నిలిపారు” అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మల్లెల రవిచంద్ర, కాలేరు సింధు తపస్వి, జూపల్లి దుర్గాప్రసాద్, సంగ్లోత్ రంజిత్, మారుముళ్ళ కిరణ్, పుల్లారావు, ప్రసాద్, రాఘవేంద్ర (రవి), శోభన్, వినోద్, అరుణ్, అఖిల్ మహర్షి, మురళీకృష్ణ, నయీమ్, అబ్దుల్, మధు, యశ్వంత్, గిరి, భార్గవ్, సాయిరాం, ఉమామహేష్, నాగ, వంశీ, హుస్సేన్, జంపన్న, యూనస్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.