తెలంగాణ సాంస్కృతిక విధానాన్ని ప్రకటించాలి – కురిమిద్ద శ్రీనివాస్

తెలంగాణ సాంస్కృతిక విధానాన్ని ప్రకటించాలి – కురిమిద్ద శ్రీనివాస్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: ప్రభుత్వం వెంటనే సమగ్ర సాంస్కృతిక విధానాన్ని ప్రకటించాలని, అర్హులైన కళాకారులందరికీ సాంస్కృతిక సారధిగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, కళాకారులకు బ్యాంకు లోన్లు, వృద్ధాప్య పింఛన్‌లు ఇవ్వాలని తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు కురిమిద్ద శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు.

బుధవారం పాల్వంచ పట్టణంలోని చండ్ర రాజేశ్వరరావు భవన్‌లో జరిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూడో మహాసభను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు, కుల-మత-జాతి అహంకారానికి వ్యతిరేకంగా ప్రజల్ని కళాకారుల ద్వారా ఆలోచింపజేసి, సమాజాన్ని చైతన్యపరిచేదే 'ప్రజానాట్యమండలి' అని పేర్కొన్నారు.

అనంతరం ప్రజానాట్యమండలి జెండాను సీనియర్ కళాకారుడు రాందాస్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కే. సాబీర్ పాషా, తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి వేముల కొండలరావు, నిర్మాణ బాధ్యులు నారటి  ప్రసాద్, అధ్యక్ష కార్యదర్శులు సురేందర్, కట్టుకూరి రాము, అడుసుమిల్లి సాయిబాబా, ముత్యాల విశ్వనాథం, విసంశెట్టి పూర్ణచంద్రరావు, నిమ్మల రాంబాబు, కె.కృష్ణ, లక్ష్మి, రామాచారి తదితరులు పాల్గొన్నారు.



Blogger ఆధారితం.