ప్రాణాపాయ స్థితిలో యువకుడు.. ఆపన్నహస్తం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపు

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: ఓ సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబం తమ కుమారుడి ప్రాణాలను కాపాడుకోవడానికి ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. తగిన వైద్యం అందించడానికి ఆర్థికంగా నిస్సహాయులైన తల్లిదండ్రులు కన్నీటిలో మునిగిపోతున్నారు.
వివరాల్లోకి వెళితే... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన సుభాని కుమారుడు రబ్బానీ (29). సుభాని డ్రైవర్‌గా కష్టపడి తన కుమారుడిని చదివించాడు. స్థానిక అనుబోస్ కళాశాలలో బీటెక్ మెకానికల్ ను పూర్తి చేసిన రబ్బానీ హైదరాబాద్‌లోని బొటానిక్ హెల్త్ కేర్ అనే ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.
అయితే ఇటీవల ఊహించని విషాదం ఆ కుటుంబాన్ని కమ్మేసింది. ప్రతిరోజులాగే సాధారణంగా విధులకు వెళ్లినట్లే జూలై 11,2025న కూడా రబ్బానీ విధుల్లో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సమాచారం తెలుసుకున్న అతని అక్క వెంటనే అక్కడికి చేరుకుని ఆయనను జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించింది. పలు వైద్య పరీక్షలు నిర్వహించి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని వైద్యులు తేల్చారు. అత్యవసరంగా శస్త్రచికిత్స అవసరమని, లేకపోతే ప్రాణాపాయం తప్పదని వైద్యులు చెప్పడంతో కుటుంబసభ్యులు వెంటనే అతనికి ఆపరేషన్ చేయించారు. ప్రస్తుతం రబ్బానీ ఐసీయూలో వెంటిలేటర్‌పై ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.
రబ్బానీ వైద్య ఖర్చులకు ఇంక సుమారు రూ. 30లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో దాతల సహకారం కోసం ఎదురుచూస్తున్నారు.
"దయచేసి మా కుమారుడి ప్రాణాలను రక్షించేందుకు మీరు ముందుకు రావాలి. మీరు ఇచ్చే ఒక్క రూపాయైనా మా కుటుంబానికి పెద్ద మద్దతవుతుంది. మేము జీవితాంతం మీ ఋణం మరిచిపోలేము," అని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు..
Account Details for Donations:
Spouse of Pathan Rabbani.
Patient Hospitalised at
Apollo Hospitals Jubilee Hills Hyderabad , Hyderabad
Name: Shaik Asma
A/C No: 62077282417
IFSC Code: SBIN0020324
Bank: State Bank of India
📲 PhonePe/Google Pay: Abdul Razak: 77998 65252

Post a Comment