తెలంగాణ ప్రజానాట్యమండలి జిల్లా మహాసభను జయప్రదం చేయండి – కొండలరావు

తెలంగాణ ప్రజానాట్యమండలి జిల్లా మహాసభను జయప్రదం చేయండి – కొండలరావు

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  రేపు పాల్వంచలో జరిగే తెలంగాణ ప్రజానాట్యమండలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూడవ మహాసభను జయప్రదం చేయాలని ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి వేముల కొండలరావు పిలుపునిచ్చారు. మంగళవారం పాల్వంచ పట్టణంలోని చండ్ర రాజేశ్వరరావు భవన్‌లో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పాల్వంచ ప్రజానాట్యమండలి నూతన కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వేముల కొండలరావు మాట్లాడుతూ 1945లో స్వాతంత్ర్యం రాకముందే IPTA (ఇండియన్ పీపుల్స్ థియేటర్స్ అసోసియేషన్) ఏర్పడి ప్రజల్లో దేశభక్తి పెంపొందించేలా, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజానాట్యమండలి కృషి చేసిందని అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రజానాట్యమండలిగా ఎన్నో పోరాటాల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించిందన్నారు. కావున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహాసభలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

నూతన కమిటీ ఎన్నిక:

తెలంగాణ ప్రజానాట్యమండలి పాల్వంచ డివిజన్ యువత కమిటీని ఎన్నుకున్నారు. ఇందులో గౌరవాధ్యక్షులుగా విసంశెట్టి విశ్వేశ్వరరావు, అధ్యక్షులుగా కేలోత్ కృష్ణ, ఉపాధ్యక్షులుగా రామడుగు రామాచారి, నరహరి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా నిమ్మల రాంబాబు, సహాయ కార్యదర్శులుగా అల్లి వెంకటేశ్వర్లు, కోశాధికారిగా ముఖ్య బికులాల్, కమిటీ సభ్యులుగా శనగరపు శ్రీనివాస్, కొత్తపల్లి రావి రామారావు, పగిడిపల్లి సంజీవరావు, తాటి నాగరాజు, వెంకన్న, సుందరం, చిట్టిబాబు లను ఎన్నుకున్నారు.


Blogger ఆధారితం.