INTUC రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ప్రణీత్
జె.హెచ్.9. మీడియా, హైదరాబాద్: ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా పేర్ల ప్రణీత్ నియమితులయ్యారు. ఈ మేరకు ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి గురువారం నియామక పత్రాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ప్రణీత్ మాట్లాడుతూ తనను గుర్తించి కీలకమైన పదవి అందజేయడం పట్ల జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల పక్షాన నిలుస్తూ, వారి సమస్యల పట్ల రాజీలేని పోరాటం చేస్తానని ప్రణీత్ తెలిపారు.
ప్రణీత్ నియామకం పట్ల పలువురు ఐఎన్‌టీయూసీ కార్మిక సంఘాల నేతలతో పాటు కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Post a Comment