డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 117మంది మందు బాబులకు జరిమానాలు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: అతిగా మద్యం తాగి వాహనాలు నడిపిన కేసులో 117 మందికి జరిమానాలు విధిస్తూ కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు బుధవారం తీర్పు చెప్పారు.
వివరాల్లోకి వెళితే కొత్తగూడెం వన్‌టౌన్ ఎస్‌ఐ తుంగ రాకేష్, జి. విజయల కథనం ప్రకారం రోడ్డుపై ఆటంకం కలిగించిన 10 మందిని మరియు వాహనాలు నడుపుతుండగా మద్యం తాగినట్టు అనుమానంతో ఆపిన 14 మందిని బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించగా మద్యం సేవించినట్టు రుజువైంది. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత నిందితులు నేరాన్ని ఒప్పుకుని జరిమానాలు చెల్లించారు.
ట్రాఫిక్ ఎస్‌ఐ కె. నరేష్ పర్యవేక్షణలో వాహన తనిఖీలు నిర్వహించగా 13 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షల్లో మద్యం తాగినట్టు నిర్ధారణ కావడంతో కోర్టులో ప్రవేశపెట్టగా, నేరాన్ని అంగీకరించి జరిమానాలు చెల్లించారు.
టూ టౌన్ ఎస్‌హెచ్‌ఓ అప్పటి టి. రమేశ్ కుమార్, ఎం. సెల్వరాజ్ బృందంతో నిర్వహించిన తనిఖీల్లో 30 మందిని బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించగా మద్యం సేవించినట్టు నిర్ధారణ అయింది. నిందితులు కోర్టులో నేరాన్ని అంగీకరించి జరిమానాలు చెల్లించారు.
సుజాతనగర్ ఎస్‌హెచ్‌ఓ ఎం. రమాదేవి తన బృందంతో తనిఖీ చేసినప్పుడు 10 మందికి పరీక్షలు నిర్వహించగా మద్యం తాగినట్టు తేలింది. కోర్టులో ప్రవేశపెట్టి జరిమానాలు విధించారు.
చంద్రుగొండ ఎస్‌హెచ్‌ఓ పి. శివరామకృష్ణ తన బృందంతో 10 మందిని పట్టుకుని బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు జరిపారు. మద్యం సేవించినట్టు నిర్ధారణ కావడంతో కోర్టులో ప్రవేశపెట్టి జరిమానాలు విధించారు.
ములకలపల్లి ఎస్‌హెచ్‌ఓ కిన్నర రాజశేఖర్ తన బృందంతో 30 మందిని బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించి మద్యం తాగినట్టు రుజువు కావడంతో వారిని కోర్టులో ప్రవేశపెట్టగా మెజిస్ట్రేట్ విధించిన జరిమానాలను వారు చెల్లించారు.
.webp)
Post a Comment