పాల్వంచ తహసిల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకుల ధర్నా
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టును సుమారు ₹18,000 కోట్ల వ్యయంతో నిర్మించారని, ఇందులో 90% పనులు పూర్తయ్యాయని తెలిపారు.
ప్రాజెక్టు పూర్తి అయితే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ జిల్లాల్లోని రైతులకు పుష్కలంగా సాగునీరు అందుతుందని వివరించారు. అయితే ఈ ప్రాజెక్టు కోసం భద్రాద్రి జిల్లాలోని రైతులు తమ భూములు ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఖమ్మం జిల్లాకు ప్రాధాన్యత ఇస్తూ సాగునీరు తరలిస్తోందని ఆరోపించారు.
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు కాబట్టి నీటిని భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు ఇవ్వకుండా ఖమ్మం జిల్లాకు మళ్లిస్తున్నారని విమర్శించారు. భద్రాద్రి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల రైతులకు సాగునీరు అందించిన తరువాతే మిగిలిన జిల్లాలకు ఇవ్వాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పాల్వంచ పట్టణ మరియు మండల బీఆర్ఎస్ నాయకులు జూపల్లి దుర్గాప్రసాద్, సంగ్లోత్ రంజిత్, మారూముళ్ల కిరణ్, కొత్తచెరువు హర్షవర్ధన్, కొట్టే రవి, పూజల ప్రసాద్, ఆలకుంట శోభన్, కాలేరు అఖిల్ మహర్షి, తోట లోహిత్ సాయి, గంగాధరి పుల్లయ్య, రుక్మాంగాదర్, మహమ్మద్ ఆదిల్, శ్రీకాంత్, కడలి సత్యనారాయణ, ఆర్.వి. రమణ, ధరిమెళ్ల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment