ధరణి పోర్టల్ నుండి రైతులను ఆదుకునేందుకే భూభారతి - కొత్వాల

ధరణి పోర్టల్ నుండి రైతులను ఆదుకునేందుకే భూభారతి  -  కొత్వాల

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  గత ప్రభుత్వం రైతులను అన్ని విధాల ఇబ్బందులకు గురి చేసిందని, అప్పుడు రూపొందించిన ధరణి పోర్టల్ వల్ల రైతులు ఎంతో విలపించారని, రైతులను ఆదుకునేందుకే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పోర్టల్ ను రూపొందించి రైతులను ఆదుకుంటుందని రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో రైతు సదస్సులు నిర్వహణలో భాగంగా సోమవారం పాల్వంచ మండల పరిధిలోని పాండురంగాపురం గ్రామంలో రైతు వేదిక వద్ద రైతు సదస్సు నిర్వహించారు. గ్రామ రైతులు తమ భూ సమస్యలను రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రైతు సదస్సులో కొత్వాల పాల్గొని దరఖాస్తు విధానాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని రూపొందించింది అన్నారు. రైతుల భూ సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రైతులు తమ భూ సమస్యలను రైతు సదస్సుల్లో అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని కొత్వాల అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్వంచ తహసిల్దార్ ధారా ప్రసాద్, పట్టణ రెవెన్యూ అధికారి ఎస్. రవికుమార్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ ఎర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, కాంగ్రెస్ నాయకులు కలగట్ల నాగిరెడ్డి, అడ్వొకేట్ పిట్టల రాము, లింగం శ్రీను, మార్గం అంకయ్య, గంగిరెడ్డి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.