న్యాయవాదులను సన్మానించిన ఎమ్మెల్యే కూనంనేని
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: కొత్తగూడెంకు చెందిన సీనియర్ న్యాయవాదులు ఎలమోలు ఉదయ భాస్కర రావు, రమేష్ కుమార్ మక్కడ్‌లను కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు తన క్యాంపు కార్యాలయంలో బుధవారం కృతజ్ఞతలు తెలుపుతూ శాలువాతో సత్కరించారు.
తన ఎన్నికను రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టులో ఓ వ్యక్తి వేసిన కేసు పరిష్కారంలో తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి, అనుభవాన్ని వినియోగించి, స్వచ్ఛందంగా పనిచేసిన సీనియర్ న్యాయవాది జి. విద్యాసాగర్, సహకరించిన కొత్తగూడెంకు చెందిన సీనియర్ న్యాయవాదులు ఎలమోలు ఉదయ భాస్కర రావు, రమేష్ కుమార్ మక్కడ్‌లకు శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ తన ఎన్నికను సవాలు చేస్తూ హైకోర్టులో వేసిన కేసును గెలిపించుటకు కృషి చేసిన సీనియర్ న్యాయవాది జి. విద్యాసాగర్, ఆయన కుమారుడు ప్రసేన్, వారికి సహకరించిన హైకోర్టు సీనియర్ న్యాయవాది బొమ్మగాని ప్రభాకర్‌లకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, న్యాయవాది మునిగడప వెంకటేశ్వర్లు, నాయకులు వంగ వెంకట్, వత్తికొండ మల్లికార్జున రావు, షేక్ ఫహీం, గుత్తుల శ్రీను, ఖయ్యుమ్, దాసరి అశోక్ పాల్గొన్నారు.

Post a Comment