ప్రకృతిని రక్షిద్దాం... భావితరాలకు ఆదర్శంగా నిలుద్దాం - జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్
మొక్కలు నాటి వాటి సంరక్షణ ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించవచ్చని ఆయన అన్నారు. మానవ మనుగడ సజావుగా సాగాలంటే ప్రకృతిని కాపాడుకోవాలని అన్నారు.
మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. పర్యావరణంపై శ్రద్ధ చూపడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ అన్నారు.
అనంతరం కోర్టు ప్రాంగణం నుండి పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు పర్యావరణ దినోత్సవ ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు.
ఈ ర్యాలీలో పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచే నినాదాలు, ఫ్లెక్సీలు ప్రదర్శించబడ్డాయి.
ఈ ర్యాలీలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్, జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్, అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె. కవిత, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి రవికుమార్, స్పెషల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ కోటేశ్వరరావు, బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జె. గోపికృష్ణ, వన్ టౌన్ సీఐ కరుణాకర్, పీ.పీలు, ఏ.పీ.పీలు, న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు, పోలీసు అధికారులు, ఏ.వో మోహన్ దాస్, జె. కిరణ్ కుమార్, కోర్టు సిబ్బంది రామిశెట్టి రమేష్, మీనా కుమారి, నాజర్ మల్లికార్జున్, ధికొండ రవికుమార్,లగడపాటి సురేష్, రామకృష్ణ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment