కొత్తగూడెం జిల్లా కోర్టులో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం కొత్తగూడెం జిల్లా కోర్టు ప్రాంగణంలో మువ్వన్నెల పతాకాన్ని ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఎస్. సరిత ఆవిష్కరించారు. పతాకావిష్కరణ అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి ఎస్. సరిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వెనుక ఉన్న ఉద్యమ త్యాగాలను గుర్తు చేశారు. తెలంగాణ అనేది ఎందరో ఉద్యమకారుల, అమరవీరుల త్యాగఫలమని, వారి ఆశయాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని, అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె. కిరణ్ కుమార్, జూనియర్ సివిల్ జడ్జి బి. రవికుమార్, స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు గోపికృష్ణ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.వి.డి. లక్ష్మి, స్పెషల్ పీపీ ఎన్. నాగిరెడ్డి, న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Post a Comment