డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో 14 మందికి జరిమానాలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో 14 మందికి జరిమానాలు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు లో 14 మందికి జరిమానా విధిస్తూ కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు గురువారం తీర్పు ఇచ్చారు.

కొత్తగూడెం వన్ టౌన్ ఎస్.ఐలు జి.విజయ, తుంగ రాకేష్‌ల కథనం ప్రకారం వాహనాలు నడుపుతుండగా ఇద్దరిని (2) ఆపి బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించగా వారు మద్యం తాగినట్లు రుజువు కాగా కోర్టులో ప్రవేశపెట్టగా, మెజిస్ట్రేట్ ముందు వారు నేరం ఒప్పుకోగా, జరిమానా విధించారు.

కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్.ఐ. కె. నరేష్ పర్యవేక్షణలో వాహన తనిఖీ చేయుచుండగా పన్నెండు మంది (12) వ్యక్తులు మద్యం త్రాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. వారికి బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించగా మద్యం తాగినట్లు రుజువు కాగా కోర్టులో ప్రవేశపెట్టగా మెజిస్ట్రేట్ విచారించగా నేరం ఒప్పుకున్నారు. వెంటనే జరిమానాలు విధించగా, అట్టి జరిమానాలు చెల్లించారు.

Blogger ఆధారితం.