సర్దార్ జలగం వెంగళరావు సేవలు చిరస్మరణీయం : యం.డి. మంజూర్

సర్దార్ జలగం వెంగళరావు సేవలు చిరస్మరణీయం : యం.డి. మంజూర్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: ఉమ్మడి ఖమ్మం జిల్లాను పారిశ్రామిక కారిడార్గా మారుస్తూ  జలగం వెంగళరావు చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన హయాంలోనే రాష్ట్రంలో విద్యా, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు యం.డి. మంజూర్ అన్నారు. గురువారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు వర్ధంతిని పురస్కరించుకుని పాల్వంచ పట్టణంలోని పూర్ణ టీ స్టాల్ వద్ద జలగం యువసేన ఆధ్వర్యంలో  ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం మంజూర్ మాట్లాడుతూ "తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్ర మంత్రిగా, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మంత్రిగా వివిధ హోదాల్లో సేవలందించిన జలగం వెంగళరావు సేవలు చిరస్మరణీయమైనవి అని అన్నారు. జలగం చేసిన అభివృద్ధి పనులు భావితరాలకు తెలిసే విధంగా ప్రభుత్వం అధికారికంగా జలగం జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించాలి, పాఠ్యపుస్తకాలలో జలగం చరిత్రను చేర్చాలి" అని ఈ సందర్భంగా మంజూర్ రాష్ట్ర  ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జలగం యువసేన నాయకులు సూరత్ మురళి, మసూద్, బొల్లం భాస్కర్, సయ్యద్ సమీ, సురేష్ నాయక్, రాజ్‌కుమార్, మౌలాలి, సంపత్, నాయుడు, శంకర్, తాండ్ర రాంబాబు, శనగ రామచందర్, ఇజ్జగాని రవి గౌడ్, జూపూడి ప్రభాకర్, పోసెట్టి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.