బాల కార్మిక నిర్మూలన అందరి సామాజిక బాధ్యత - జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 12న నిర్వహిస్తున్నామని, బాల కార్మికులను నిర్మూలించేందుకు పటిష్టమైన సామాజిక రక్షణ వ్యవస్థలు అవసరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ తెలిపారు.
గురువారం కొత్తగూడెం పెద్దబజార్‌లో హమాలీ కార్మికులతో జరిగిన న్యాయ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పేదరికం కారణంగా ఎంతో మంది బాలలు బాల కార్మికులుగా మారుతున్నారని పేర్కొన్నారు. ఇటుక బట్టీలలో పనిచేసే కార్మికులు పేదరికంతో దినసరి కూలీలుగా మారుతున్నారని తెలిపారు.
అనంతరం న్యాయమూర్తి పెద్దబజార్‌లోని కిరాణా దుకాణాలను తనిఖీ చేశారు. చిన్నపిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టపరంగా నేరమని యజమానులకు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ షర్ఫుద్దీన్, మర్చంట్ కమిషన్ అధ్యక్షుడు పల్లపోతు సాయి, హమాలీ కార్మికుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, హమాలీలు పాల్గొన్నారు.

Post a Comment