లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్‌గా పాల్వంచ బిడ్డ
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: కొత్తగూడెం జిల్లా కోర్టులో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్‌గా పాల్వంచ పట్టణానికి చెందిన యువ మహిళా న్యాయవాది ముమ్మాడి పావని నియమితులయ్యారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్..జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా నియామక పత్రాలు అందుకున్న పావని మాట్లాడుతూ, “జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్‌గా నియమితులవడం గౌరవంగా భావిస్తున్నాను. నిరుపేద నిందితులకు న్యాయసహాయం అందించేందుకు నిబద్ధతతో పని చేస్తాను,” అని చెప్పారు.
తనకు ఈ బాధ్యతను అప్పగించిన జిల్లా జడ్జి పాటిల్ వసంత్‌కు, లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఎం. రాజేందర్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
పావని నియామకంపై కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు జనపరెడ్డి గోపికృష్ణ, కోశాధికారి కనకం చిన్ని కృష్ణ, ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐఎల్‌పీఏ) జిల్లా కమిటీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

Post a Comment