అతిగా మద్యం త్రాగి వాహనాలు నడిపిన 26 మందికి జరిమానాలు

అతిగా మద్యం త్రాగి వాహనాలు నడిపిన కేసుల్లో 26 మందికి జరిమానాలు

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: కొత్తగూడెం కోర్టులో 26 మంది మందుబాబులకు జరిమానాలు విధిస్తూ స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు శుక్రవారం తీర్పు వెలువరించారు.కొత్తగూడెం వన్ టౌన్ ఎస్‌ఐ తుంగ రాకేష్ కథనం ప్రకారం, వాహన తనిఖీ సమయంలో ఒకరిని ఆపి బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించగా మద్యం తాగినట్లు రుజువైంది. కోర్టులో ప్రవేశపెట్టగా నేరం ఒప్పుకొని జరిమానా చెల్లించారు.

కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్‌ఐ కె. నరేష్ పర్యవేక్షణలో జరిగిన తనిఖీల్లో తొమ్మిది మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. కోర్టులో నేరం ఒప్పుకొని జరిమానాలు చెల్లించారు.పాల్వంచ టౌన్ ఎస్‌హెచ్‌ఓ కె. సుమన్ తనిఖీల్లో ఒకరు మద్యం మత్తులో వాహనం నడుపుతుండగా పట్టుబడ్డారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో మద్యం తాగినట్లు రుజువై, కోర్టులో నేరం ఒప్పుకొని జరిమానా చెల్లించారు.

కొత్తగూడెం టూ టౌన్ ఎస్‌హెచ్‌ఓ టి. రమేష్ కుమార్, ఎస్‌ఐలు మహమ్మద్ కేఎం అలీ ఖాన్, బీ. కిషోర్, అప్పటి సబ్ ఇన్‌స్పెక్టర్ ఎం. సెల్వరాజ్‌ల బృందం నిర్వహించిన తనిఖీల్లో 15 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టగా నేరం ఒప్పుకుని జరిమానాలు చెల్లించారు.

Blogger ఆధారితం.