జాతీయ లోక్ అదాలత్‌లో క్రిమినల్ అప్పీల్‌ను పరిష్కరించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్

జాతీయ లోక్ అదాలత్‌లో క్రిమినల్ అప్పీల్‌ను పరిష్కరించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  జాతీయ లోక్ అదాలత్‌లో క్రిమినల్ అప్పీల్‌ను శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ ఇరు వర్గాల కక్షిదారులతో చర్చించి పరిష్కరించారు.

కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్ ఏరియాకు చెందిన షేక్ ఖతీజా బేగం, తన భర్త సికింద్రాబాద్‌లోని డిఫెన్స్ విభాగంలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న షేక్ నజీర్‌పై 2014లో గృహ హింస కేసు దాఖలు చేశారు. ఆ కేసులో షేక్ నజీర్‌కు మనోవర్తి ఇవ్వాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అనంతరం షేక్ నజీర్ జిల్లా కోర్టులో అప్పీల్ దాఖలు చేయగా, ఇరువర్గాల మధ్య చర్చలు జరిపి, కోర్టులో ఆయనే స్వయంగా తన భార్య ఖతీజా బేగంకు మొత్తం పరిష్కారంగా ₹1,50,000 (ఒక లక్షా యాభై వేల రూపాయలు) చెల్లించారు.

ఈ కేసులో షేక్ నజీర్ తరఫున న్యాయవాది అరకల రవికుమార్, ఖతీజా బేగం తరఫున న్యాయవాది బాగం మాధవరావు వాదనలు వినిపించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ పట్టుపల్లి నిరంజన్ రావు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.