భద్రాచలం సబ్ జైలు ను సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్

భద్రాచలం స్పెషల్ సబ్ జైలు సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ బుధవారం భద్రాచలం స్పెషల్ సబ్ జైలు‌ను సందర్శించారు. ఈ సందర్భంగా విచారణ ఖైదీలతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విచారణ ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు.

జైలులో ఉన్న విచారణ ఖైదీలలో న్యాయవాదిని నియమించుకునే ఆర్థిక స్థోమత లేని ఖైదీలకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. అనంతరం జైలు పరిసరాలు, ఖైదీలకు వడ్డించే ఆహారం, అందుబాటులో ఉన్న సదుపాయాలు, ఆరోగ్య పరిస్థితులు తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. ఖైదీలలో మార్పు రావడానికి కృషి చేయాలని సూచించారు.

ఆ తరువాత జిల్లా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న శిశు గృహాన్ని కూడా ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ జె. ఉపేందర్ పాల్గొన్నారు..


Blogger ఆధారితం.